Rahu and Ketu, the shadow planets in Vedic astrology, change signs approximately every 18 months, bringing significant shifts in karmic energy and life patterns. The upcoming transit from May 2025 to December 2026 is expected to influence all 12 zodiac signs in unique ways — affecting career, relationships, finances, and spiritual growth. These planets represent illusion, karma, detachment, and transformation, making their transit a powerful period of change. In this blog, explore how this transit will impact your zodiac sign and discover effective remedies to balance its effects.
ప్రతి 18 నెలలకు రాహు మరియు కేతువులు తమ రాశులను మార్చుతూ, మన జీవితాలపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతాయి. 2025 మే నుండి 2026 డిసెంబర్ వరకు జరిగే ఈ గ్రహ మార్పు అనేక రాశులపై ప్రత్యేక ప్రభావాలను చూపనుంది. వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, రాహు – కేతువులు కర్మ, భయాలు, మాయ, గతజన్మ ఫలితాలను సూచించే శక్తివంతమైన గ్రహాలు. ఈ కాలంలో మీ రాశిపై ఏమి ప్రభావం ఉంటుందో, అలాగే దుష్ప్రభావాలను తగ్గించడానికి ఏయే పరిహారాలు చేయాలో ఈ వ్యాసంలో తెలుసుకుందాం.
మేషరాశి…. (అశ్విని 1 2 3 4,భరణి 1 2 3 4,కృతిక 1వ పాదం) (నామ నక్షత్రములు: చూ, చే ,చొ, లా,లీ, లూ, లే, లో,ఆ)
రాహు కేతువులు లాభ పంచమ స్థానాల్లో ప్రవేశించడం వల్ల రాహు ప్రభావం వలన ఎంతో కాలంగా రావలసిన సొమ్ములు చేతికి అందుతాయి, వచ్చిన ధనాన్ని వ్యర్థం కాకుండా ప్రణాళిక పరంగా ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలలో, శని యొక్క ప్రభావంతో మోసగించేవారు, అధికంగా ఉండడం వల్ల వారు ప్రలోభాలతో ఆశ పెట్టే అవకాశం అధికంగా ఉంది. అధిగమించడానికి సుమంతో సుమంతో కార్తవీర్యార్జునాయ నమః శ్లోకాన్నిచేసుకొనుట మంచిది. గురు దృష్టి వల్ల అనవసర వ్యయ సమస్యలను అధిగమించగలుగుతారు. పంచమ కేతు వలన ఆలోచనలలో చికాకుల అధికంగా ఉంటాయి. మానసిక అనారోగ్యాలు కలగకుండా జాగ్రత్త తీసుకోవాలి. ముఖ్యంగా ప్రియమైన వారితో సంతానముతో అభిప్రాయ భేదములు రాకుండా చూసుకోవాలి విద్యార్థులకు విద్య విషయాలలో వైరాగ్యం రాకుండా జాగ్రత్త వహించాలి. జ్ఞాపక శక్తి విషయంలో జాగ్రత్తలు వహించాలి. ఇబ్బందులను అధిగమించడానికి దూర్వాయుగ్మములతో గణపతి పూజ చేసుకొనుట మంచిది.
వృషభరాశి…(కృతిక 2,3,4,రోహిణి 1 2 3 4,మృగశిర 1 2 పాదాలు) (నామ నక్షత్రములు:ఈ, ఊ, ఎ, ఓ, వా, వీ, వూ, వె, వో)
రాహు కేతువులు దశమ చతుర్ధ స్థాన సంచారం వలన స్థిరాస్తుల విషయంలోనూ స్థానచలనముకు, ఉద్యోగ బదిలీలకు అవకాశములు .నూతన వృత్తికి, కొత్త బాధ్యతలకు మంచి సమయం. ఆర్థికపరమైన ఇబ్బందులు నష్టముకలగ వచ్చు. వృత్తిపరమైన అభివృద్ధి ఉన్నప్పటికీ కొన్ని విషయాలలో అనవసర అధిక శ్రమ తత్ఫలితముగా అలసట కలగ వచ్చు. గురు దృష్టి చాలా వరకు సమస్యలను అధిగమించగలరు. కేతువు చతుర్ధస్థాన ప్రవేశం వలన గృహ, విద్య మాతృ సంబంధ అంశాలలో అసంతృప్తి వైరాగ్యం, వేళకి ఆహార సక్రమం గా తీసుకోలేక పోవటం, విద్యార్ధులకి జ్ఞాపకశక్తి లోపం, విద్య మీద శ్రద్ధ తగ్గడం, ప్రయాణములలో ఆటంకాలు, ఖర్చులు. విద్యార్థులకు విద్యాసంబంధ ఆటంకాలు. అధిగమించడానికి గణపతికి పూజ చేసుకుంటూ ముందుకు వెళితే మంచిదే.
మిధున రాశి…(మృగశిర 3 4,ఆరుద్ర 1 2 3 4,పునర్వసు 1,2,3 పాదాలు) (నామ నక్షత్రములు: కా, కి, కూ, ఖం , జ్ఞ, చ్చ, కే, కో, హ, హి)
రాహు కేతువులు నవమ తృతీయ స్థాన సంచార సమయంలో విద్య, వృత్తి మొదలగు విషయాలకు సంబంధిత విదేశీయానము కొరకు చేయు ప్రయత్నములు కొంతవరకు సత్ఫలితాలను ఇవ్వవచ్చు. చాలా తరచుగా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఇతరులతో కమ్యూనికేషన్ విషయాల్లో అపార్ధాలు రాకుండా జాగ్రత్తగా ఉండాలి. దూర ప్రదేశములలో విద్య ఉద్యోగ అవకాశములు, విదేశీ ప్రయత్నాలు, తలపెట్టిన కార్యక్రమాలు అన్నింటా ఆటంకములను కలిగించ వచ్చు. అయినప్పటికీ గురుడి దృష్టి వల్ల సమస్యలు అధిగమించ గలుగుతారు. కేతు ప్రభావం వల్ల పనులు పూర్తికానున్న సమయంలో కొత్త ఇబ్బందులు అనవసర ఖర్చులవలన ఆర్థికపరమైన చిక్కులు, ఇతరుల సహాయ సహకారాలపై అసలు ద్రుష్టి, ఇష్టం ఉండవ్, లౌకిక అంశాలపై శ్రద్ధ ఉండదు. దగ్గర వారితో అభిప్రాయాలూ కలవవు. ఎక్కువ దూరం గా ఉండటానికి ప్రాధాన్యత, కమ్యూనికేషన్ లోపం, సహకారాలు సమయానికి స్వీకరించడానికి వైరాగ్యము. దగ్గర ప్రయాణాలపై అయిష్టత. గణపతికి దూర్వాయుగ్మ పూజ మంచిది.
కర్కాటక రాశి…(పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4 పాదాలు) (నామ నక్షత్రములు: హి, హూ, హే, హో, డా, డీ ,డూ, డే, డో)
రాహు కేతువులు అష్టమ ద్వితీయ స్థాన సంచార సమయంలో మాట్లాడే సమయంలో అపార్థము లకు ఎక్కువ అవకాశం ఉన్న దృష్ట్యా తక్కువగా మాట్లాడాలి. ఇతరులకు మేలు చేసే సమయంలో కూడా అపార్థములకు అవకాశమున్న దృష్ట్యా ఎక్కువ జాగ్రత్తగావ్యవహరించాలి. ఆర్థిక సంబంధమైన విషయాలలో, పన్ను కన్ను సంబంధించి ఆరోగ్య విషయాలు శ్రద్ధ అవసరం. మాటల వల్ల కుటుంబ సంబంధాలు ఘర్షణాత్మకంగా ఉండే అవకాశం ఉన్న రీత్యా జాగ్రత్త అవసరం. రాహువు అష్టమ స్థానప్రవేశము అధిక అనవసర వ్యయం, ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. పలువిధ సమస్యలు ఆర్థిక సమస్యలను, అనవసర ఖర్చులు లోనుకాకుండా దుర్గా జపములు చేయిచటం మంచిది. గురుని దృష్టి వల్ల అనవసర ఖర్చులు అధిగమించ గలుగుతారు. ఆర్ధిక అంశాలలో, సంపాదనపై అభివృద్ధి ఆసక్తి తక్కువ. కుటుంబంలో కొత్త వ్యక్తుల జోక్యం, ఖర్చులు ఆరోగ్యపరమైన చిరాకులు. మాటల్లో వైరాగ్యం, తక్కువ మాట్లాడి ఎక్కువ అర్ధం చేసుకోటం మంచిది. వీలైనంత మౌనం గా ఉంటారు.
సింహరాశి…(మఖ 1 2 3 4, పుబ్బ 1 2 3 4, ఉత్తర 1వ పాదం) (నామ నక్షత్రములు: మా, మీ, మూ, మే, మో, టా, టీ, టూ, టే)
రాహు కేతువులు సప్తమ జన్మ స్థానాల్లో సంచారం చేయునప్పుడు ఇతరుల పనుల విషయంలో ఎక్కువ శ్రద్ధ చూపిస్తూ, తన సొంత విషయాలను లో కొంత వ్యతిరేకత పొందే అవకాశం ఉన్న దృష్ట్యా సమస్యలను ఎవరో పరిశీలిస్తారు ఎవరో తీరుస్తారు అనే భావనతో లేకుండా అందులో నుంచి బయటికి వచ్చి తన సమస్యలను తాను స్వయంగా తీర్చుకోవడం మంచిది. వ్యక్తిగత శ్రద్ధ ఆసక్తి తగ్గి యోగ ప్రాణాయామ మెడిటేషన్ వంటివాటిపై ఇష్టం, కొత్త వ్యక్తులతో కలవటం స్నేహసంబంధా లపై ఆసక్తి ఉండవ్, ప్రయాణాలు చేయడానికి కూడా ఇష్టం దైవభక్తి పెరుగుట. ముఖ్యంగా వైవాహిక జీవితం, భాగస్వామ్య వ్యవహారాలు తగిన జాగ్రత్త అవసరం. చాలా వరకు గురుని దృష్టితో అధిగమించే అవకాశాలు ఉన్నాయి. రాహు కేతువుల వల్ల సమస్యలు అధిగమించడానికి శ్రీ దుర్గయే నమః, శ్రీ గణేశాయ నమః శ్లోకాలు మేలు.
కన్యా రాశి…(ఉత్తరఫల్గుణి 2 3 4,హస్త 4,చిత్త 1 2 పాదాలు) (నామ నక్షత్రములు: టో,పా,పి,పూ,షం,ణా,పే,పో)
రాహు కేతువులు షష్ట వ్యయ స్థానములలో సంచారము చేయునప్పుడు రాహు ప్రభావం వల్ల శత్రువుల పై విజయం సాధించగలుగుతారు. ఖర్చులు చేయునప్పుడు జాగ్రత్తగా ఉండాలి. పోటీలలో విజయం సాధించటం, పుణ్య క్షేత్ర సందర్శన, పుణ్య నదీస్నానాలు. వివిధ పోటీలలో నెగ్గుతారు, కృషిశీలత పెరుగుతుంది ఋణములు తీరుస్తారు, శత్రువులపై పట్టు సాధిస్తారు.గురుని దృష్టి వల్ల సహకారంతో ముందుకు వెళతారు. రోగ నిరోధకశక్తి పెరిగినా, ఆరోగ్యము మిద ప్రభావము కొంత ఉండేందుకు అవకాశం కనుక ఆహార పానీయాలను తీసుకునే విషయములో శ్రద్ధవహించ వలసి ఉంది. ఆధ్యాత్మిక విషయాల మీద కొంతవరకు ఆసక్తి, ఖర్చులను నియంత్రించుకోవాలి. ఆధ్యాత్మిక ప్రసంగాలు, ప్రవచనాలు వినడం.
తులా రాశి…(చిత్త 3 4,స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3 పాదాలు) (నామ నక్షత్రములు: రా, రి, రూ, రె, రో, తా, తీ, తూ, తే)
రాహు కేతువులు పంచమ లాభ స్థాన సంచార సమయములో సంతాన వర్గ విషయాల్లో శ్రద్ధ ఎక్కువ తీసుకోవాలి. ముఖ్యముగా మగ సంతానము దుర్వ్యసనాలకు లోను కాకుండా జాగ్రత్తపడాలి. ఆర్థిక విషయాలలో ప్రయోజనాలు సిద్ధిస్తాయి కానీ వాటిని ప్రధానముగా భావించటం వల్ల నష్టపోయే ప్రమాదముంది. స్త్రీ సంతానం అభివృద్ధికరంగా ముందుకు సాగుతుంది. గురుని దృష్టి వల్ల సమస్యలు కొంత తక్కువగా ఉంటాయి. వచ్చిన లాభాలను సద్వినియోగ పరచుకోవడంలో ఆసక్తి తక్కువగా ఉండటం వల్ల ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. సమస్యను అధిగమించడానికి వినాయకుడికి పూజ చేయడం మంచిది
వృశ్చిక రాశి…(విశాఖ 4,అనురాధ 1 2 3 4, జేష్ఠ 1 2 3 పాదాలు) (నామ నక్షత్రములు: తో, నా, నీ, నూ, నె, నో, యా, యీ, యు)
రాహు కేతువులు చతుర్ధ దశమ స్థాన సంచార సమయములో వృత్తి వ్యవహారములలో అపార్థము లకు అవకాశం ఉంది. చేసే ప్రయత్నములు కొంత వ్యర్ధం అయ్యే అవకాశాలు, పనులలో ఆలస్యములు, మీ అధికారుల నుంచి మాట రాకుండా జాగ్రత్తలు తీసుకొనుట మంచిది. తల్లిగారి ఆరోగ్యం లో ఇబ్బందులు. ఆకస్మిక సమస్యలను ఇబ్బందులను కలిగించును. తల్లి భూమి వాహనము సంబంధించిన సమస్యలు ఉన్నప్పటికీ గురుని దృష్టి వల్ల అధిగమించగలుగుతారు. కేతువు వలన అధికారులతో పేచీలు. ఉన్న వృత్తినుండి తప్పుకునే ఆలోచనల,ఉపాధి అవకాశాలు తగ్గడం లేక కోల్పోవుట, ఆహారము వసతి విషయములలో అసౌకర్యాలు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు ఆర్థిక పరమైన సమస్యలు. సమస్యలు అధిగమించడానికి గణపతికి దుర్వ యుగ్మములతో పూజ మంచిది
ధను రాశి…(మూల 1 2 3 4,పూర్వాషాఢ 1 2 3 4,ఉత్తరాషాఢ 1వ పాదం) (నామ నక్షత్రములు: యే, యో, భా,భీ, భూ, ధ, ఫ, డా, భే)
రాహు కేతువులు తృతీయ నవమ స్థానములో సంచారము చేయు సమయంలో లౌకిక ప్రయాణములు అధికం, అవి కొంతవరకు సత్ఫలితాలను ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. కమ్యూనికేషన్ విషయాలలో జాగ్రత్తగా వ్యవహరించాలి.మిత్రులు లేదా సన్నిహిత వ్యక్తులు తో చేరి వారి సహకారం అధికంగా ఆశించి తర్వాత అసంతృప్తికి లోనవుతారు. ఆశించినంత అందివ్వనివ్యక్తులు దూరం అవుతారు. తెలివి ఉపయోగించి కార్యములు చక్కబెట్టుటకు ప్రయత్నము చేస్తారు. దగ్గర ప్రయాణాల్లో మోసాలకు అవకాశాలు. నూతన స్నేహాల విషయంలో తగుజాగర్తలుమంచిది, అయినప్పటికీ గురుని దృష్టి వలన వ్యక్తిగత సామర్ధ్యం పెరగడం, ధైర్య సాహసాలు పెరగడం సొంతంగా పనులను నిర్వర్తించు కోవడం చేస్తారు. కేతువు వలన దూరప్రయాణాలకి ఆటంకములు అనాసక్తి, దూర వృత్తులపై అసంతృప్తి. తండ్రి ఆరోగ్యం మీద శ్రద్ధవహిస్తారు.పెద్దలు గురువుల సందర్శన, ఆశీస్సులు. ఆధ్యాత్మిక అంశాలలో ఆసక్తి ఉన్నా ఆటంకాలు. పుణ్యబలం పెంచుకొనే కృషిచేయాలి, దైవభక్తి పెరుగుతుంది, పెద్దలను గౌరవించి వారికి కావలసిన సదుపాయములను చేస్తారు. పెద్దలు స్వామీజీలు ఆశీస్సులు. విద్యార్థుల విదేశీ అవకాశాలుకి అధికంగా శ్రమించాలి. ఎక్కువగా గణపతి మందిరాన్ని సందర్శించడం,శ్రీ గణేశాయ నమః శ్లోకం మేలు.
మకర రాశి…(ఉత్తరాషాఢ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ఠ 1 2 పాదాలు) (నామ నక్షత్రములు: భ,జా,జి,ఖి,ఖు,ఖే,ఖో,గా,గి)
రాహు కేతువులు ద్వితీయ అష్టమ స్థానములో సంచరించునప్పుడు వీలైనంత వరకు ఖర్చులను నియంత్రించుకోవాలి. ఇతరులు మరియు కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు అపార్ధాలకు అవకాశం ఉన్నందున తక్కువ మాట్లాడాలి ఎక్కువ వినడానికి ప్రాధాన్యత ఇవ్వాలి. గురుని దృష్టి ఉండడం వల్ల సమస్యలను అధిగమించే ప్రయత్నాలు చేయగలరు. కేతు ప్రభావం వల్ల ఆచార వ్యవహారములను అలవాట్లలో మార్పు,శుభ కార్యాలు వాయిదా, కంటి పంటి సమస్యలు వేధిస్తాయి. ఆకస్మిక ప్రయాణములు, ఇదివరకు ఉన్న దీర్ఘకాలిక అనారోగ్యాలు పెరిగేఅవకాశం, కనుక ఆరోగ్యము అశ్రద్ధ చేయరాదు. శ్రీ గణేశాయ నమః, శ్రీ దుర్గా దేవి యై నమఃశ్లోకములు నిత్యము
కుంభ రాశి…(ధనిష్ట 3 4, శతభిషం 1 2 3 4, పూర్వాభాద్ర 1 2 3 పాదాలు) (నామ నక్షత్రములు: గూ, గే, గో, సా, సి, సు, సే, సో, దా)
రాహు కేతువులు జన్మ సప్తమ స్థాన సంచార ప్రభావం వలన అతివిశ్వాసం,తన విషయాలను ఎక్కువ ఆశ కు గురి కావడం వల్ల సమాజంలో గుర్తింపు, గౌరవము తగ్గుతుంది. వ్యతిరేకత పెరుగుతుంది. గురుని దృష్టి వల్ల సొంత ఆలోచనల్లో కొంత మంచి మార్పు ఉంటుంది. అయినప్పటికీ కేతు ప్రభావము ఇతరుల విషయాలలో అశ్రద్ధ వలన వారికి కొంత దూరం అవుతారు. ఈ విషయం ముఖ్యంగా ఉద్యోగ స్థానంలో ఎక్కువ ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ముఖ్యముగా దుర్గాదేవికి, గణపతికి సంబంధ శ్లోకములు, దేవాలయసందర్శన మేలు
మీన రాశి…(పూర్వాభాద్ర 4,ఉత్తరాభాద్ర 1 2 3 4,రేవతి 1 2 3 4 పాదాలు)(నామ నక్షత్రములు: దీ , దు, ఇ+, ఝ, ధా, దే, దో, చా, చి)
వ్యయ రాహు ప్రభావము వలన ఋణములు చేసేవి షయములో, ఆరోగ్య పరమైన, అధిక అనవసర ఖర్చులలో, వ్యసనపరలైన వ్యక్తుల స్నేహములో జాగర్త మంచిది. దూర ప్రయాణములకు ముఖ్యంగా ఫారిన్ కంట్రీస్ . గురుని దృష్టి వల్ల అనవసరమైన ఖర్చులను అధిగమించ గలుగుతారు. కేతు ప్రభావము వలన దీర్ఘా్కాలిక అనారోగ్యముల విషయాల్లో శ్రద్ధ అవసరము. రోగనిరోధక శక్తి పెంచుకోవాలి. పోటీలలో వైరాగ్య ధోరణి.ఆరోగ్యం బాగున్నప్పటికీ, అప్పులు ఇస్తే తిరిగి రావడం కష్టం అనవసర వ్యయములు అధికము. ఆచితూచి ఖర్చుపెట్టాలి. వ్యసనము లకు దూరంగా ఉండాలి. వీలైనంతవరకు దుర్గాదేవి, గణపతి శ్లోకములు, దూర్వ యుగ్మ పూజ, మేలు
డా|| ఈడుపుగంటి పద్మజారాణి
జ్యోతిష్యము & వాస్తు నిపుణురాలు