newpadmajaastrocom

Weekly Rasi Phalalu (Horoscope) 27.07.2025 నుండీ 02.08.2025 వరకు ద్వాదశరాశి ఫలములు (వార ఫలాలు)

Rashiphalalu

Step into the week of July 27 to August 2, 2025, with astrological clarity. This weekly Rasi Phalalu offers insights into the planetary influences on all 12 zodiac signs, highlighting opportunities and challenges in career, health, finance, and relationships.

జూలై 27 నుండి ఆగస్టు 2, 2025 వరకు వార రాశిఫలాలు చదవండి. ఈ వారం గ్రహచలనలు మీ ఉద్యోగం, ఆరోగ్యం, ఆర్థికం, మరియు వ్యక్తిగత సంబంధాలపై చూపే ప్రభావాన్ని తెలుసుకోండి. ద్వాదశ రాశుల ఫలితాలు తెలుగులో అందుబాటులో ఉన్నాయి.

వారం ప్రారంభంలోవ్యాపార విస్తరణ కోసం, సంతాన సంబంధ విషయాలలో, నూతన ఇన్వెస్ట్మెంట్స్ కొరకు ఆలోచనలు చేస్తారు. దూర ప్రయాణానికి, ఉన్నత విద్య కొరకు ప్రయత్నం చేసే వారికి విదేశీ అవకాశా ములు. శ్రమ అధికం. కంటి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి, వృత్తికి సంబంధించిన విషయాలలో, భాగస్వామ్య వ్యవహారాలలో ఉన్నత స్థాయి వ్యక్తుల యొక్క సహకారాన్ని ఆశిస్తారు. ఇతరుల సహకారాన్ని తీసుకునేటప్పుడు వైరాగ్య ధోరణిని వదిలేయాలి. తోబుట్టువులు తో వైరికి దూరంగా ఉండాలి.   ఆర్థికపరమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి.  వారము చివరిలో దూర ప్రదేశాల నుంచి  సమాచారాలుకొంత అందుతుంది. ప్రయాణాలలో చికాకులు, అనవసరమైన వ్యయాలు, ఆశించిన అంశాలలో చాలా శ్రమ ఫలితాలు ఇస్తాయి.  పౌరుషం పెరుగుతుంది ఆకస్మిక విషయాలు, ముఖ్యమైన అంశాలలో ఆలస్యాలు ఆటంకాలు, ఆరోగ్య విషయంలో శ్రద్ధ,  మరిన్ని మంచి ఫలితాల కొరకు లలితా దేవిని ప్రార్థించట మేలు.

వారం ప్రారంభంలో  గమనించగా గృహ వాహన రిపేర్ల కొరకు శ్రద్ధ.స్త్రీ సంతానం అభివృద్ధి. పురుష సంతానం మీద, వారి అలవాట్లు, అభివృద్ధి కొరకు ప్రత్యేక దృష్టిని కేటాయించాలి.విద్యార్థులు విద్య మీద దృష్టిని కేటాయించాలి.  మానసిక ప్రశాంతత కొంత తక్కువగా ఉంటుంది. ఉన్నత స్థాయి వ్యక్తులతో విభేదాలకు దూరంగా ఉండాలి.  వారం మధ్యలో పందెములు, బెట్టింగులు మొదలైన వాటికి దూరంగా ఉండాలి. గవర్నమెంట్ పనులలో ఉన్నత స్థాయి అధికారులు రాజకీయ నాయకుల సహకారాన్ని కోరుకుంటారు. ఉన్నత విద్య కొరకు విదేశీయానానికి శ్రమ చేస్తారు. వారం చివరిలో పనులు కొంతవరకు ముందు కదులుతాయి. కుటుంబ సభ్యుల, భాగస్వామి సహకారంతో ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. వ్యాపారాన్ని సహకారంతో వృద్ధి చేసుకునే ఆలోచనలు, అసంతృప్తి అధికంగా ఉంటుంది  వృత్తిపరమైన విషయాల అభివృద్ధి, నూతన పరిచయాలు, వ్యాపార విస్తరణ, వీలైనంతవరకు అభిప్రాయ బేధాలకు దూరంగా ఉండాలి. గృహ వాతావరణం అసౌకర్యంగా ఉంటుంది, ప్రశాంతత తక్కువ, పెద్దల ఆరోగ్యశ్రద్ధ తీసుకుంటారు మరిన్ని మంచి ఫలితాల కొరకు శివాలయ సందర్శన మంచిది

వారం ప్రారంభంలో ఫలితాంశములను గమనించగా దగ్గర ప్రయాణాలకు అవకాశం, వ్యక్తిగత ఆరోగ్యవిషయంలో, అధికఖర్చులు, ముఖ్య వ్యవహారాలలో శక్తి సామర్ధ్యాలను పెంచుకుంటూ ముందుకు వెళ్ళడానికి కృషి చేస్తారు. వృత్తిపరమైన చికాకులు, ముఖ్యముగా కుటుంబ వ్యవహారాలు ఊహించని ఇబ్బందులను పెంచుతాయి. వారం మధ్యలో డ్రైవింగ్ చేసేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి, వాహనమునకు సంబంధించిన ఇబ్బందులు, అధికం. గృహ వాతావరణం అసౌకర్యం, ప్రశాంతత తక్కువగా ఉంటుంది. వృత్తిపరమైన విషయాలలో ముఖ్యంగా సమయాలు అనవసర గందరగోళం. తలనొప్పి, కంటికి సంబంధించిన అనారోగ్యాలు, నిర్లక్ష్యం చేయరాదు. ఆరోగ్య, వాహన విషయాలు జాగ్రత్త. జ్ఞాపకశక్తి తగ్గుతుంది ఆరోగ్య ఆహార శ్రద్ధ చాలా అవసరం. స్త్రీలతో విభేదాలు రాకుండా జాగ్రత్తగా ఉండాలి. వృత్తిపరంగా అనవసర వ్యక్తుల జోక్యం చికాకును సృష్టిస్తుంది. మరిన్ని మంచి ఫలితాలు సత్యనారాయణ స్వామి ఆరాధన మంచిది.

వారం ప్రారంభంలో ఫలితాంశములను గమనించగా ఆర్థిక విషయాలలో ఆటంకాలు, వాగ్దానాలు నిలుపుకోవడంలో ఇబ్బందులు, అనవసర ఖర్చులు కుటుంబ వ్యవహారాల్లో చికాకులను పెంచుతాయి. జీవిత భాగస్వామితో, కుటుంబములోని సభ్యులతో అనవసర వాదనలకు దూరంగా ఉండాలి,  వ్యాపార వ్యవహారములలో, స్నేహ సంబంధాలలో తగిన జాగ్రత్తలు అవసరం. వారం మధ్యలో పౌరుషం పెరుగుతుంది నాయకత్వ లక్షణాల శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి. వ్యక్తుల సహకారాన్ని పొందుతారు. నూతన గృహ వాహనములకు, రుణముల కొరకు ప్రయత్నాలుచేస్తారు. వారాంతంలో పూర్వ రుణములు చెల్లిస్తారు. సంతానము అభివృద్ధి కొరకు, ఇన్వెస్ట్మెంట్స్ కొరకు ప్రణాళికలు అధిక ఖర్చులు నియంత్రణ అవసరం కుటుంబ స్త్రీల సహకారాన్ని పొందుతారు. మానసిక ప్రశాంతత తనే పెంచుకోవాలి. విందు వినోదాల్లో పాల్గొంటారు, మంచి ఫలితాల కొరకు దత్తాత్రేయుని ఆరాధన మంచిది 

వారం ప్రారంభంలో ఫలితాంశములను గమనించగా భాగస్వామి వ్యవహారాల మీద దృష్టి సారిస్తారు. జీవిత భాగస్వామి సహకరిస్తారు.  ఉల్లాసంగా ఉత్సాహంగా కొత్త పనులు మొదలు పెడతారు. మానసిక ప్రశాంతతను పెంచుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు, అనవసర ఖర్చులను కొంతమేర నియంత్రించుకో గలుగుతారు. ఆరోగ్య విషయంలో ఖర్చులు. రహస్య శత్రువుల విషయంలో జాగ్రత్తలు అవసరం, బాతృ వర్గంతో విభేదాలకు దూరంగా ఉండాలి. వారం మధ్యలో కుటుంబ వ్యవహారాలలో, ఆర్థిక విషయాలలో అనవసర వ్యక్తుల ప్రమేయాన్ని అధిగమించడానికి ప్రయత్నం చేస్తారు. భాగస్వామి కుటుంబ సభ్యులతో అభిప్రాయ బేధాలుకు దూరంగా ఉండాలి. దీర్ఘకాలిక అనారోగ్యాలను అధిగమించాలి అన్న విధానాల్లో శ్రద్ధ తీసుకుంటారు. వారం చివరిలోనూతన వాహన కొనుగోలు కొరకు, భాగస్వామికి బహుమానాల కొరకు వెచ్చిస్తారు.  విద్యార్థులకు పోటీ తత్వం పెరుగుతుంది, రుణములు చెల్లిస్తారు, రోగ నిరోధక శక్తి పెరుగుతుంది, ధైర్యంగా సాహసంగా ముందుకు పెడతారు, కానీ ప్రతి విషయంలో, బంధుమిత్రులతో మాట్లాడేటప్పుడు ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. మరిన్ని మంచి ఫలితాల కొరకు విష్ణు సహస్రనామ పారాయణ మంచిది

వారం ప్రారంభంలో ఫలితములు గమనించగా ఆర్థిక ఖర్చులు నియంత్రించు కోవడానికి ప్రయత్నం చేస్తారు,  సంతాన ఆరోగ్య సంబంధమైన, పెట్టుబడులు విషయాలలో, కొంత చికాకులు. ఉద్వేగాల అధికంగా ఉంటాయి. మానసిక ప్రశాంతత తక్కువగా ఉంటుంది. సమయానికి ఆహార స్వీకరణ విశ్రాంతి అవసరం, వృత్తిపరమైన ప్రయాణములు. జీవిత భాగస్వామి తోను వారి యొక్క బంధువులతో మాట్లాడేటప్పుడు, అనవసర అపార్థములకు లోను కాకుండా జాగ్రత్తలు అవసరం. పౌరుషం నాయకత్వ లక్షణాలు ఆదిపత్య ధోరణిని విడనాడాలి. చిన్న చిన్న విషయాలకి కలహములు, అపార్థములు ఏర్పడే అవకాశం ఉన్న రిత్య జాగ్రత్తలు అవసరం. మధ్యలో వాతావరణం అనుకూలంగా ఉంటుంది, ముఖ్యంగా తోబుట్టులతో, భాగస్వామితో అనవసర అపార్థములు తగ్గుతాయి ప్రయాణములు చేయునప్పుడు, ముఖ్యంగా డ్రైవింగ్ సందర్భాలలో విష్ణు: గరుడ వాహన అనే శ్లోకాన్ని పట్టించడం మేలు. వారం చివరిలోసామర్థ్యం పెరుగుతుంది, షాపింగులు, విందు వినోదాల్లో పాల్గొంటారు. మంచి ఫలితాల కొరకు లలితా దేవి శ్లోకాలు అష్టోత్తరాలు, లలితా సహస్రనామం మేలు.

వారం ప్రారంభంలో ఫలితాంశములను గమనించగా  లాభ చంద్ర సంచారముచే సంతానముతో అనుబంధము అనుకూలత, సృజనాత్మకత పెరుగుతుంది పెరుగుతుంది,  షాపింగులు విందు వినోదాలు, మంచి ఖర్చులు ఆనందాన్ని ఇస్తాయి. ఎదురుచూస్తున్న వర్తమానాలు దూర ప్రదేశాల నుంచి అందుకుంటారు. ఒక వార్త ఆసక్తిని రేకెత్తిస్తుంది. సంతానం నుంచి బహుమతులు అందుకుంటారు, గృహ వాహన, తల్లి ఆరోగ్యం, వ్యవసాయ సంబంధం అంశాలు కొంత అసౌకర్యం, మానసిక ప్రశాంతత తక్కువగా ఉంటుంది. ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకోవాలి. విద్యార్థులు విద్య మీద దృష్టి అవసరం.  వారం మధ్యలో అనవసర ఖర్చులు, వాగ్వాదములకు దూరంగా ఉండాలి. దీర్ఘకాలిక పెట్టుబడుల కొరకు ప్రయత్నాలు చేస్తారు. ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యము తగదు, వారం చివరిలో మాటలతో పనులు సాధించుకుంటారు. ప్రణాళికలని అమలు చేసుకుంటూ ముందుకు వెళతారుఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి.  మరిన్ని మంచి ఫలితాల కొరకు ఆదిత్య హృదయ పారాయణ మంచిది.

వారం ప్రారంభంలోనూతన వాహనాలు, గృహములు సంబంధించిన అంశముల మీద విస్తృతంగా దృష్టి సారిస్తారు.  ఉన్నత స్థాయి వ్యక్తులతో ఆశించిన విషయాలలో, ముఖ్యంగా గవర్నమెంట్ సంబంధించిన పనులలో సామాన్య ఫలితాలు. వృత్తిపరమైన విషయాల మీద ఎక్కువ శ్రద్ధ తీసుకుంటారు గృహ వాతావరణం, వాహన సంబంధ విషయాలు కొంత అసౌకర్యంగా ఉంటుంది. గురువులు పెద్దలు ఆశీర్వచనాలు, ఉన్నత విద్య కొరకు విదేశీ ప్రయాణాలకి కొంత అవకాశములు. ఆర్థిక సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి, ముఖ్యంగా విదేశాలలో ఉండే తోబుట్టువులు, స్నేహితులు సహకారం  కూడా అందుకుంటారు.  వారం చివర్లో  విద్యార్థులకు విద్యాసంబంధమైన విషయం మీద దృష్టి సారించాలి. వృత్తికి సంబంధమైన విషయాలలో ఆకస్మిక ఖర్చులు, ప్రయాణాలు చికాకులు ఇబ్బంది కలిగిస్తాయి. వాహనాల నడిపేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.  కోపాన్నిపౌరుషాన్నినియంత్రించుకోవాలి. తల్లి ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. కొంత సంతాన సంబంధ ఖర్చులు పెరుగుతాయి,  దైర్య సాహసాలు  నిర్ణయం సామర్థ్యం మెరుగు. మంచి ఫలితాల కొరకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన మంచిది

వారం ప్రారంభం గృహ వాతావరణంలో కుటుంబ సభ్యులతో, ఆర్థిక అంశాలలో తగిన విధంగా ఆచితూచి వ్యవహరించాలి వృత్తికి సంబంధించిన విషయాలలో ప్రయాణాలకు అవకాశం. మాటలు విషయంలో కుటుంబ వ్యవహారాలలో,  బాధ్యతలు పెరుగుతాయి.  సహకార లబ్ధి, ఆశించిన ఫలితాలు పొందుతారు ఆర్థిక విషయాలు అనుకూలం, ఎంతగానో ఎదురు చూస్తున్న విషయాలలో దూర ప్రదేశము నుంచి ఆసక్తికరమైన సమాచారాన్ని అందుకుంటారు. అలవాట్లకి కూడ దూరం మంచిది.ఆకస్మిక చికాకులు ఇబ్బంది పెట్టే విధానం. అనవసరమైన ఖర్చు. ముఖ్యంగా శ్రమ అధికంగా ఉంటుంది, ఒత్తిడి, బంధు వర్గంతో విభేదాలకు దూరంగా ఉండాలి. కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకుంటారు. మరిన్నిమంచి ఫలితములు కొరకు గణేష్  ఆరాధన, దేవాలయ సందర్శన మంచిది

వారం ప్రారంభంలో ప్రయాణాలలో జాగ్రత్తలు అవసరం, ఆరోగ్యము తగిన శ్రద్ధ తీసుకోవాలి. చాలాకాలంగా ఎదురుచూస్తున్న ఆర్థిక విషయాలు, మైత్రి బంధాలు సామాన్యం.ఆర్థిక సంబంధమైన విషయాలలో వాగ్వాదాలలో, అనవసరమైన ఖర్చులకి దూరంగా ఉండాలి,  వైరాగ్యాన్ని అధిగమించాలి. వృత్తిపరమైన విషయాల్లో తగిన శ్రద్ధ తీసుకొని ముందుకు వెళ్లాలి. ఆధ్యాత్మికత పెరుగుతుంది,  దైవచింతన  సంకల్పబలంతో అనుకున్నది సాధిస్తారు.  విదేశీ వ్యవహారాలకు సంబంధించిన విషయాలలో ధన రాబడి, తండ్రి ఆరోగ్యం, ఆకస్మిక విషయాలు, విదేశీ వ్యవహారాలు, ఉన్నతవిద్య, వ్యాపారవ్య వహారాలు కొంత ఆందోళనను, అశాంతిని కలిగిస్తాయి. నిరాసా నిస్పృహాలను అధిగమించాలి, మానసిక ప్రశాంతతను పెంపొందించు కునేందుకు యోగా మెడిటేషన్ చేయాలి. ఎదురుచూస్తున్న విషయాలలో సంతోషకరమైన వార్తలు అందుకుంటారు. చివరిలో నెట్వర్క్ ను పెంపొందించు కుంటారు.  మరిన్ని మంచి ఫలితాలు కొరకు దుర్గా దేవి ఆరాధన మంచిది.

వారం ప్రారంభంలో సంఘంలో గుర్తింపు గౌరవం,  ఉన్నత స్థాయి వ్యక్తులతో ఆశించిన పనుల జరగడానికి సూచనలు.

మిత్రుల సహకారం, పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి. రోగ నిరోధక శక్తి, శత్రు రోగ రుణాల మీద విజయాన్ని సాధిస్తారు. ఆశించిన పనులలో విజయం, ఆర్థిక లాభం, ఆగుతూ వస్తున్న అనేకమైన మిశ్రమంగా పనులు ముందుకు వెళతాయి.  అనవసరమైన ఖర్చులు నియంత్రించుకో గలుగుతారు. ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతారు. మీ మీద మీకు నమ్మకం, స్థిరమైన అభిప్రాయాలు.  మధ్యలో వ్యాపార విస్తరణ స్నేహ సంబంధాలు బలపడతాయి, నూతన పరిచయాలు విందు వినోదాలు, భాగస్వామ్య వ్యవహారాలలో పెట్టుబడులకి ఆలోచనలు, జీవిత భాగస్వామితో నూతన ప్రదేశాలకి వెళ్ళడానికి అవకాశాలు. వారం మధ్యలో ప్రయాణాల్లో చికాకుల్ని, అధిగమించాలి. వృత్తి, సంతాన సంబంధమైన విషయాలు తో అధిక శ్రమ. తదుపరి సామాజిక సేవ లో పాల్గొనుట, పెద్దల ఆశీస్సులు. ఆకస్మికంగా అనవసరమైన ఖర్చు, ఆరోగ్య సంబంధమైన విషయాలలో శ్రద్ధ,  ముఖ్యమైన విషయాలు వాయిదా మానసిక అశాంతి. వారం చివరిలో అసంతృప్తిని అధిగమించాలి.  మరిన్ని మంచి ఫలితములు కొరకు సూర్యనారాయణస్వామి ఆరాధన మంచిది. 

వారం ప్రారంభంలో కోర్టు వ్యవహారాలు, ఆర్థిక విషయాలు ,పోటీలు అనుకూలము. రుణాలు చెల్లిస్తారు,  వృత్తిని పుణ్యాలను పెంచుకుంటారు. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది, శత్రువుల మీద విజయం సాధిస్తారు.  సంతానమునకు అభివృద్ధి, ఆర్థిక విషయాల కోసం ఎక్కువ ఆలోచనలు చేస్తారు. తగిన గుర్తింపు గౌరవం. భాగస్వామి వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. మైత్రి బంధాలు బలపడతాయి. కంటి ఆరోగ్యం లో శ్రద్ధ తీసుకోవాలి, ఆహార నియమాలు పాటించాలి, ఆకస్మిక: విమర్శలకు, సోదర వర్గంతో విభేదాలకు దూరంగా ఉండాలి. మధ్యవర్తిత్వం పనికిరాదు.  వారం చివరిలో వృత్తి సంబంధమైన విషయాలలో అధిక శ్రమతో ముందుకు వెళతారు. ఉన్నత స్థాయి వ్యక్తులతో మాటామంతి. ప్రయాణాలకు అవకాశం, ఆలోచనలు ఫలిస్తాయి,  నూతన వృత్తులకు ప్రయత్నం చేసే వారికి మంచి అవకాశాలు.  మరిన్ని మంచి ఫలితాలు కొరకు విష్ణు సహస్రనామ పారాయణ మంచిది

డా|| ఈడ్పుగంటి పద్మజారాణి / Dr Edupuganti Padmaja Rani

జ్యోతిష్యము & వాస్తు నిపుణురాలు / Astrology & Vaastu Consultant

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

× Lightbox Image